లక్నో: జై ప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుంచి ఉద్భవించిన నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని జై ప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్ఐసీ)ను సందర్శించేందుకు గురువారం రాత్రి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సోషలిస్ట్ నేత జై ప్రకాష్ నారాయణ్ (జేపీ) జయంతి సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అఖిలేష్ యాదవ్ అక్కడకు చేరుకున్నారు. ఒక వాహనంపై ఏర్పాటు చేసిన జేపీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.
కాగా, అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం జేపీఎన్ఐసీ ప్రధాన ద్వారాన్ని మూసివేసి తన ప్రవేశాన్ని నిరోధించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్డీయేకు మద్దతు వెనక్కి తీసుకోవాలని బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్‌ను కోరారు. ‘చాలా మంది సోషలిస్టులు ఎన్డీయే ప్రభుత్వంలో ఉన్నారు. ఆ ప్రభుత్వం కొనసాగడానికి సహాయం చేస్తున్నారు. నితీశ్ కుమార్, ఆయన పార్టీ జై ప్రకాష్ నారాయణ్ ఉద్యమం నుంచి ఉద్భవించారు. జేపీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించేందుకు సోషలిస్టులను అనుమతించని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడానికి నితీశ్ కుమార్‌కు ఇది ఒక అవకాశం’ అని అన్నారు. అయితే జేపీఎన్ఐసీలో పనులు జరుగుతున్నందున భద్రతా కారణాల వల్ల అఖిలేష్ యాదవ్‌ను అనుమతించలేదని అధికారులు వివరించారు.
#WATCH | Lucknow, UP | Samajwadi Party Chief Akhilesh Yadav says, “Many of the Socialist people are in the govt and helping the govt to continue. Bihar CM Nitish Kumar emerged from his (Jai Prakash Narayan) movement, this is a chance for Nitish Kumar to withdraw support from the… pic.twitter.com/w3CduLGBwu
— ANI (@ANI) October 11, 2024