న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ బిల్లు ప్రతిపాదనపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మండిపడ్డారు. ఇంత హడావిడి చేస్తున్న ప్రధాని మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శనివారం పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ హాజరై ఈ చర్చలో పాల్గొని ప్రసంగించారు.
కాగా, అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనపై మండిపడ్డారు. ‘ఈ నివేదికలో 2,000 పేజీలు ఉంటాయని నేను అనుకుంటున్నా. నివేదిక ఏమిటో కూడా మాకు తెలియదు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ తీసుకురావడానికి వారు ఇంత హడావిడి చేస్తున్నారు. ప్రధాని మోడీ ఇవాళ (పార్లమెంట్‌కు) వస్తున్నారు. ప్రభుత్వాన్ని ఆయన రద్దు చేయాలి. రాజ్యాంగంపై చర్చ జరుగుతున్నప్పుడు ఇదే మంచి సమయం. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని మీడియాతో అన్నారు.
#WATCH | Delhi: Samajwadi Party chief Akhilesh Yadav says, “The Prime Minister is coming today, dissolve the government, hold elections once again in the whole country. If there is so much hurry for one nation one election, then the governments of the whole country should be… pic.twitter.com/nz1enBGxBA
— ANI (@ANI) December 14, 2024