బుధవారం 08 జూలై 2020
National - Jun 25, 2020 , 19:37:52

గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై నిజాలు చెప్పండి: అఖిలేష్ యాద‌వ్‌

గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల‌పై నిజాలు చెప్పండి: అఖిలేష్ యాద‌వ్‌

ల‌క్నో: గల్వాన్‌లో భార‌త్‌-చైనా దేశాల మధ్య జరిగిన ఘర్షణల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నిజాలు వెల్ల‌డించాల‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ డిమాండ్ చేశారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించి అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో తాము ఏ మాత్రం ఏకీభవించబోమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ నిజాలు త‌ప్ప మిగ‌తా అన్ని వివ‌రాలు చెబుతోంద‌ని విమ‌ర్శించారు.   

ఎవరూ భారత భూభాగంలోకి ప్రవేశించలేదని, భారత భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకభ‌వించ‌న‌ని అఖిలేశ్ చెప్పారు. తాను మాత్ర‌మే కాద‌ని, దేశ ప్ర‌జ‌ల్లో చాలా మంది ప్రజలు ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను న‌మ్మ‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. స‌రిహ‌ద్దు అంశం దేశ భద్రతకు, సమగ్రతకు చెందినద‌ని అందుకే ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అఖిలేశ్ డిమాండ్ చేశారు.logo