మేనల్లుడే వారసుడు
బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మాట తప్పారు. తన కుటుంబ సభ్యులెవరినీ తన రాజకీయ వారసులుగా ప్రకటించనని 15 ఏండ్ల క్రితం తన ఆత్మకథలో పేర్కొన్న ఆమె..
- మాట తప్పిన మాయావతి బీఎస్పీ తదుపరి అధినేతగా ఆకాశ్ ఆనంద్
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మాట తప్పారు. తన కుటుంబ సభ్యులెవరినీ తన రాజకీయ వారసులుగా ప్రకటించనని 15 ఏండ్ల క్రితం తన ఆత్మకథలో పేర్కొన్న ఆమె.. తాజాగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(28)ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆకాశ్ ఆనంద్ మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు. బీఎస్పీలో మాయావతి తర్వాత రెండో స్థానం ఆనంద్ కుమార్‌దే. ఆయన 2019లో పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది ఆకాశ్‌ను పార్టీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. అయితే మాయావతి యూపీ, ఉత్తరాఖండ్‌లో పార్టీని ముందుకు నడిపిస్తారని, ఆనంద్ ఇతర రాష్ర్టాల బాధ్యతలు నిర్వర్తిస్తారని బీఎస్పీ నాయకుడు ఉదయ్‌వీర్ సింగ్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akash Anand
- BSP
- Mayawati
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

