Bird Strike | మహారాష్ట్ర పుణె నుంచి ఢిల్లీ (Pune To Delhi)కి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్ (Akasa Air Flight)ను పక్షి ఢీ (Bird Strike) కొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.
ఈనెల 10వ తేదీన ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన QP 1607 విమానం పుణె నుంచి ఢిల్లీకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా పక్షి ఢీ కొట్టింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ప్రయాణికులు, సిబ్బంది సేఫ్‌గా ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం ఇంజినీరింగ్ బృందం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Karur stampede | భారీ భద్రత నడుమ.. ఈనెల 17న కరూర్ వెళ్లనున్న టీవీకే చీఫ్ విజయ్
Donald Trump | ఆ బహుమతి నాకు ఇవ్వమని అడగలేదు.. నోబెల్ శాంతి దక్కకపోవడంపై ట్రంప్ స్పందన