Karur stampede | టీవీకే (TVK) చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) కరూర్ పర్యటన తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈనెల 17న విజయ్ కరూర్ వెళ్లి తొక్కిసలాట (Karur stampede) బాధితులను పరామర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. విజయ్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
నెల 27న కరూర్‌లో టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. తొక్కిసలాట (Karur Stampede) జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన ఇన్నిరోజులైనా విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలతో (Victims Families) విజయ్ ఇటీవలే వీడియో కాల్లో మాట్లాడారు. త్వరలో కలుస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసుల అనుమతితో విజయ్ కరూర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ ఈనెల 17న విజయ్ కరూర్ వెళ్లనున్నారు. తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. వారి ఇళ్ల వద్ద కాకుండా బాధిత కుటుంబాలను.. ఓ ప్రత్యేక వేదికలో పరామర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం వేదిక ఇంకా ఖరారు కాలేదని సదరు వర్గాలు తెలిపాయి. విజయ్ పర్యటనలో ఎలాంటి ఘటనలూ జరగకుండా పార్టీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే విజయ్ పర్యటనకు భద్రత కల్పించాలంటూ పోలీసులను కోరింది. విజయ్ తిరుచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కరూర్‌లోని సమావేశ వేదికకు చేరుకునే వరకూ జనసమూహ నియంత్రణకు జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించేలా ప్రణాళిక చేస్తున్నారు. ముందస్తు అనుమతి పొందిన బాధిత కుటుంబ సభ్యులను మాత్రమే వేదిక వద్దకు అనుమతించనున్నారు. మీటింగ్‌కు పరిమిత సంఖ్యలోనే మీడియాను అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Senior Haryana cop | హర్యానా డీజీపీ ఆత్మహత్య.. ఎస్పీపై వేటు