బారామతి: ఇవాళ జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు(Ajit Pawar Funeral) గురువారం నిర్వహించనున్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేపట్టనున్నారు. ముంబైలోని విద్యా ప్రతిష్టాన్‌లో 29వ తేదీన ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు కూడా కడసారి వీడ్కోలు పలికేందుకు వస్తున్నారని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర సర్కారు బుధవారం పబ్లిక్ హాలీడే ప్రకటించింది. మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు.