న్యూఢిల్లీ: మహారాష్ట్రలో అజిత్ పవార్ ఎపిసోడ్ నేపథ్యంలో బీజేపీ తీరుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముందు అవినీతిపరులంటూ విమర్శల దాడి చేయడం.. తర్వాత వారినే ఆలింగనం చేసుకోవడం ఆ పార్టీకే చెల్లిందన్నారు.
అవినీతిపై దర్యాప్తు జరిపిస్తామంటూ హామీలు ఇస్తారు.. తర్వాత వారి మద్దతు కోసమే ఆరాట పడుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రతిపక్షాల ఐక్యతకు భయపడి, ఎన్సీపీని చీల్చిందని పీడీపీ అధినేత్రి మెహబూబా ఆరోపించారు.