ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పవార్ల కుటుంబం జట్టు కట్టింది. పింప్రి-చించ్వాడ్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయబోతున్నాయి.
ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించారు. పవార్ పరివార్ మళ్లీ కలుసుకుందన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.