న్యూఢిల్లీ: అజిత్ దోవల్(Ajit Doval) మళ్లీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. మూడవసారి ఆయన ఆ పదవిని చేపట్టనున్నారు. ఇక ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా డాక్టర్ పీకే మిశ్రాను నియమించారు. ఈనెల 10వ తేదీ నుంచి ఆ నియామకం అమలులోకి రానున్నట్లు అపాయింట్స్ కమిటీ తెలిపింది. పదవీకాలం సమయంలో పీకే మిశ్రాకు క్యాబినెట్ మంత్రి హోదా ర్యాంక్ ఇవ్వనున్నారు. ప్రధాని మోదీకి సలహాదారులుగా అమిత్ ఖేర్, తరుణ్ కపూర్లను నియమించారు. రెండేళ్ల కాలపరిమితి కోసం ఆ ఇద్దర్నీ నియమించారు.
Ajit Doval KC has been reappointed as the National Security Advisor( NSA). pic.twitter.com/HZqblt4g2h
— Press Trust of India (@PTI_News) June 13, 2024