న్యూఢిల్లీ: ప్రధానిగా మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్రపతి భవన్ వేదికకానుంది. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దక్షిణాసియా దేశాధినేతలు తరలిరానున్నారు. అదేవిధంగా 8 వేల మంది వీక్షించనున్నారు.
ఈ నేపథ్యంలో దేశరాజధానిలో (Delhi) భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదేవిధంగా దేశ రాజధానిని నో ఫ్లై జోన్‌గా (No Fly Zone) ప్రకటించి నిషేధాజ్ఞలు విధించారు. అదేవిధంగా రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. సంసద్ మార్గ్, రఫీ మార్గ్, రైసినా రోడ్, రాజేంద్ర ప్రసాద్ రోడ్, మదర్ థెరిసా క్రెసెంట్, సర్దార్ పటేల్ మార్గ్‌లలో పాస్ ఉన్న వాహనాలు మాత్రమే రావాలని సూచించారు.