Aircraft crash : మహారాష్ట్ర (Maharastra) లో శిక్షణ విమానం (Training Aircraft) కూలిపోయింది. పుణే జిల్లా (Pune district) లోని బారామతి (Baramati) లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. పుణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్‌బర్డ్ ఏవియేషన్ (Redbird Aviation) సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో బారామతి విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న గోజుబావి గ్రామం (Gojubavi) సమీపంలో విమానం క్రాష్ ల్యాండ్ (crash land) అయ్యింది.
ఇవాళ ఉదయం 8.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్‌కి ముందు విమానంలోని కొంత భాగం ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో శిక్షణ పొందుతున్న పైలట్ మాత్రమే ఉన్నారు. ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి దారితీసిన సాంకేతిక లోపంపై కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
కాగా బారామతి సమీపంలో ఇంతకుముందు కూడా విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఆయనతోపాటు మరో నలుగురు కూడా మృతిచెందారు.