మంగళవారం 19 జనవరి 2021
National - Dec 29, 2020 , 16:00:21

ఇక ప్రయాణికుల వాహనాలకు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి

ఇక ప్రయాణికుల వాహనాలకు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి

హైదరాబాద్‌ : ప్రయాణికుల వాహనాలకు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాహనం ముందు రెండుసీట్లకు ఎయిర్‌ బ్యాగులు తప్పనిసరిగా అమర్చుకోవాలని ఆదేశించింది. పాత వాహనాదారులు జూన్‌ 1 వ తేదీ లోపు తమ వాహనాలకు ఎయిర్‌ బ్యాగులు అమర్చుకోవాలని సూచించింది. కొత్తగా వచ్చే అన్ని వాహనాలు ఈ నిబంధనను పాటించాల్సిందేనని పేర్కొంది.

2021 ఏప్రిల్‌ 1 నుంచి ఎయిర్‌ బ్యాగ్‌ వాహనాల నిబంధనను పక్కాగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. రోడ్డు ప్రమాదాల  నేపథ్యంలో అధిక ప్రాణనష్టం జరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం అందుకు అనుగుణంగా రహదారులను విస్తరించకపోవడంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.