చండీగఢ్: పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో శుక్రవారం అధికారులు తాజా గా వైమానిక దాడుల హెచ్చరికల సైరన్ మోగించారు. చండీగఢ్‌లో అధికార యంత్రాంగం సైరన్ మోగించి ప్రజలను ఇండ్లలోనే ఉండమని విజ్ఞప్తి చేసింది. ‘దాడులు జరిగే అవకాశం ఉండొచ్చని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెచ్చరిక వచ్చింది. దీంతో ప్రజలందరినీ ఇండ్లలోనే ఉం డమని విజ్ఞప్తి చేశాం.
బాల్కనీలు, బహిరంగ ప్రదేశాలు, పైకప్పులపైన ఉండొద్దని కోరాం’ అని పేర్కొన్నది. గంట తర్వాత సైరన్ హెచ్చరిక ముగిసింది. చండీగఢ్ పక్కనే ఉన్న పంచకులలోనూ సైరన్ మోగింది. చండీగఢ్ సరిహద్దుల్లో నివసించే మొహాలీ జిల్లా ప్రజలు కూడా ఇండ్లలోనే ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది.