న్యూఢిల్లీ: పార్కిన్సన్స్ వ్యాధి కారకాల్లో వాయుకాలుష్యం ఒకటని అమెరికాలోని బారో న్యూరలాజికల్ ఇన్స్టిట్యూట్ రిసెర్చర్ బ్రిట్టనీ క్రిజిజనోవ్స్కీ చెప్పారు.
కాలుష్యం తక్కువ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికన్నా, కాలుష్యం 50 శాతం కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసించేవారికి ఈ వ్యాధి ముప్పు 56 శాతం ఎక్కువగా ఉంటుందన్నారు.