న్యూఢిల్లీ: విమాన ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖకు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా(Air India), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డబ్బులు రిఫండ్ ఇవ్వనున్నది. మే 31వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణం రద్ద చేసుకున్న రక్షణ సిబ్బందికి డబ్బులు వాపస్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూపు ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్టా రక్షణశాఖ తమ సిబ్బందికి చెందిన సెలవులను రద్దు చేసింది. టికెట్ రద్దు చేసుకున్న వారికి పూర్తి స్థాయిలో రిఫండ్ ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. దీనిపై ఆ సంస్థ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత 300 విమానాల షెడ్యూల్ కు అంతరాయం ఏర్పడింది. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న పది విమానాశ్రయాల్లో కమర్షియల్ ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. లేహ్, శ్రీనగర్, జమ్మూ, ధర్మశాల, కాండ్లా, అమృత్సర్ ప్రాంతాలకు తమ విమానాలను రద్దు చేస్ఉతన్న ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్ సంస్థలు ప్రకటించాయి. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్‌లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలను ఇండియా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.