చెన్నై : తిరువనంతపురం-ఢిల్లీ ఎయిరిండియా విమాన ప్రయాణికులకు ఆదివారం రాత్రి గుండె ఆగిపోయినంత పని అయిందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. సాంకేతిక లోపం ఏర్పడటంతో దీనిని చెన్నైకి మళ్లించారని, విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నించినపుడు, అదే రన్‌వేపై మరొక విమానం ఉన్నట్లు తెలిసిందని, తృటిలో ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఏఐ 2455 విమానంలో ఆయనతోపాటు మరికొందరు ఎంపీలు, ప్రయాణికులు ఉన్నారు. తిరువనంతపురంలో బయల్దేరిన కాసేపటికే ఈ విమానం కుదుపులకు గురైంది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించారు. విమానాశ్రయంలో దిగేందుకు అనుమతి కోసం రెండు గంటలపాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.