న్యూఢిల్లీ : థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి శుక్రవారం బయల్దేరిన ఎయిరిండియా ఏఐ 379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో బయల్దేరిన కాసేపటికే ఈ విమానాన్ని అత్యవసరంగా దించేశారు.
దీనిలోని మొత్తం 156 మంది ప్రయాణికులు సురక్షితంగా క్రిందికి దిగిపోయారు. అనంతరం విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. దీనిలో పేలుడు పదార్థాలు లేవని తేల్చారు.