Air India | అమృత్సర్-బర్మింగ్‌హామ్ మధ్య నడుస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా విమానం ఏఐ117 ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య ఎదురైందని.. విమానం ప్రయాణిస్తున్న సమయంలో రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) తెరుచుకున్నట్లుగా గుర్తించినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానం ప్రధాన పవర్, హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయకపోతే RAT అనేది యాక్టివేట్ చేసే భద్రతా పరికరం. ఈ సమయంలో అన్ని వ్యవస్థలు సాధారణంగా పని చేసినట్లు ప్రతినిధి పేర్కొన్నారు. విమానాన్ని బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేసినట్లు తెలిపారు.
ఈ క్రమంలో విమానాన్ని తనిఖీ చేసేందుకు.. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఏఐ117 విమానాన్ని రద్దు చేశారు. ప్రయాణీకులు ఇతర విమానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందదని.. ఈ మేరకు ప్రయాణికులు సహకరించాలని ఎయిర్ ఇండియా ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల భద్రత, సౌలభ్యమే ఎయిర్‌లైన్ ప్రాధాన్యత అతని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడేది లేదని ఎయిర్ ఇండియా ప్రతినిధి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి ఎయిర్ ఇండియా సమగ్ర సాంకేతిక సమీక్షకు ప్రాధాన్యత ఇస్తోందని, భద్రతా ప్రోటోకాల్‌లకు అనుగుణంగా విమానం గ్రౌండింగ్ చేయడం ప్రామాణిక ముందు జాగ్రత్త చర్య అని ప్రతినిధి తెలిపారు.