చెన్నై, అక్టోబర్ 11: తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఎయిర్ ఇండియా విమానం ఉత్కంఠకు గురి చేసింది. తిరుచ్చి నుంచి షార్జాకు వెళ్లేందుకు 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.45కు బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో కొద్దిసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాన్ని తిరిగి తిరుచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయాలని నిర్ణయించారు. అయితే ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవచ్చునని భావించి ఇంధనం ఖాళీ కోసం విమానాన్ని రెండు గంటలపాటు గాలిలో చక్కర్లు కొట్టించారు. తర్వాత బెల్లీ ల్యాండింగ్ చే యించాలని నిర్ణయించగా ల్యాండింగ్ గేర్ పనిచేయడంతో రాత్రి 8.15 గంటలకు విమానం సురక్షితంగా తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ అయ్యింది.