న్యూఢిల్లీ, జనవరి 24: భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన ఎయిరిండియా సంస్థకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.1.10 కోట్ల జరిమానా విధించింది. అత్యవసర ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ లేకుండానే బోయింగ్ 777 విమానాలను అమెరికాకు నడిపించిందని ఆరోపిస్తూ ఎయిరిండియా మాజీ పైలట్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇవ్వడంతోపాటు భారీ జరిమానా కూడా విధించింది. ఎయిరిండియాకు జరిమానా విధించడం వారంలోనే ఇది రెండోసారి.