Air India | న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఓటర్లను ముఖ్యంగా మొదటిసారి ఓటేయనున్న యువతను ప్రోత్సహించేందుకు విమాన టికెట్ ధరలో రాయితీ ఇస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కంపెనీ ప్రకటించింది.18-22 ఏండ్ల లోపు ఓటర్లు ప్రస్తుతం కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయడానికి సొంత ఊరికి వెళ్లేందుకు చేసే ప్రయాణంలో 19 శాతం రాయితీ ఇస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది.
బిజినెస్, ఎకానమీ క్లాసుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నది. ‘దేశ భవిష్యత్తును యువత తీర్చిదిద్దే క్రమంలో వారి సాధికారత పెంచడానికి ‘ఓట్ యాజ్ యు ఆర్’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’ అని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ తెలిపారు.