న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తును జరపాలంటూ ప్రమాదంలో మృతి చెందిన కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కర్ రాజ్ సభర్వాల్ (91) సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ ప్రమాదంపై అధికారికంగా దర్యాప్తు చేస్తున్న ఏఏఐఐబీ పక్షపాతంగా వ్యవహరిస్తూ, అనవసరంగా పైలట్ తప్పిదంపైనే దృష్టి సారించిందని ఆయన ఆరోపించారు.