Air India | పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఈ నెల 8 వరకు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేసిన విషయం తెలిసింది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తుదిపరి ఉత్తర్వులు వెలువడే వరకు విమాన కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఎయిర్ ఇండియా టెల్ అవీవ్‌కు విమానాలను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు టికెట్ డబ్బులను వాపస్ చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఓ పోస్ట్‌లో పేర్కొంది.
మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టెల్ అవీవ్ నుంచి విమానాల షెడ్యూల్డ్ కార్యకలాపాలు తదుపరి నోటీసు వచ్చే వరకు తక్షణమే నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా ఆగస్టు 8 వరకు టెల్ అవీవ్‌కు బయలుదేరే అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఆగస్టు 2న ప్రకటించింది. అతిథులు, సిబ్బంది భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది. సమాచారం కోసం 011-69329333, 011-69329999 నంబర్లకు కాల్ చేయాలని సూచించింది. ఎయిర్ ఇండియా ఢిల్లీ, టెల్ అవీవ్ మధ్య వారానికి నాలుగు విమానాలను నడుపుతున్నది.