న్యూఢిల్లీ, మే 25: మన దేశంలో ఏడాదికి దాదాపుగా 20 లక్షల మంది ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసుకొని పట్టా అందుకుంటున్నారు. ఏటా జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న వీరికి సరిపడా ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమవుతున్నది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిరుద్యోగులకు కాస్త ఊరట కల్పించే ప్రయత్నం ప్రారంభించింది.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు పొందేందుకు ఉపయోగపడేలా ‘అప్న’ ప్లేస్మెంట్ ఏజెన్సీతో కలిసి స్టూడెంట్ కెరీర్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని తమ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు వెతుక్కునేందుకు అవకాశం ఉంటుంది. https:// student-career-portal.aicte-india.org ద్వారా ఈ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.