AIADMK sacks 29 Leaders | తిరుగుబాటు వర్గంపై అన్నాడీఎంకే చర్యలు.. సీవీ షణ్ముగం సహా 29 మంది నేతల తొలగింపు
AIADMK sacks 29 Leaders | తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగడంతో ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం చర్యలు చేపట్టారు.
చెన్నై: తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరుగడంతో ఆ పార్టీ అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం చర్యలు చేపట్టారు. (AIADMK sacks 29 Leaders) ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం సహా తిరుగుబాటు నాయకులను వారి పదవుల నుంచి తొలగించారు. 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా మొత్తం 29 మంది నేతలపై వేటు వేశారు.
కాగా, 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో 108 సీట్లు మాత్రమే ఎన్నికల్లో టీవీకే గెలుచుకున్నది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజారికి మార్కు 118 సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మరోవైపు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి 25 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో విజయ్ అసెంబ్లీలో తన మెజారిటీని సునాయాసంగా నిరూపించుకున్నారు. 144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో బలపరీక్షలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు వర్గంపై అన్నాడీఎంకే చర్యలు చేపట్టింది. 29 మంది నేతలను పార్టీ పదవుల నుంచి తొలగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

