న్యూఢిల్లీ, జూన్ 1: ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే ఒక సరికొత్త ఏఐ యాప్ ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’ని గూగుల్ తీసుకొచ్చింది. దీని నుంచి శక్తివంతమైన ఏఐ మోడల్ సేవల్ని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే పొందొచ్చు. దీని సాయంతో స్మార్ట్ఫోన్లో వివిధ రకాలను చిత్రాలను రూపొందించటం, కోడ్ రాయటం, సమాధానాలు పొందటం వంటివి చేయవచ్చునని ‘గూగుల్’ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత గోప్యత, భద్రతకు భంగం వాటిల్లకుండా, వేగవంతమైన పనితీరును ఈ యాప్ ద్వారా పొందవచ్చునని తెలుస్తున్నది. యాప్ పనితీరుపై సాఫ్ట్వేర్ డెవలపర్స్ నుంచి ఫీడ్ బ్యాక్ కోరుతున్నది.