Arunachal MLAs Join BJP | నలుగురు అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు.. బీజేపీలో చేరిక
Arunachal MLAs Join BJP | అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. (Arunachal MLAs Join BJP) రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పెమా ఖండూ సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాండాంగ్తోపాటు ఎన్పీపీ శాసనసభ్యులు ముచ్చు మితి, గోకర్ బాసర్ బీజేపీలో చేరారు. అస్సాం మంత్రి, అరుణాచల్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అశోక్ సింఘాల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, నలుగురు ఎమ్మెల్యేల చేరికతో అరుణాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి అసెంబ్లీలో సంఖ్యా బలం పెరిగింది. మొత్తం 60 మంది సభ్యుల్లో ప్రస్తుతం బీజేపీకి 56 మంది శాసన సభ్యులున్నారు. కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు. లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి ముందు కాంగ్రెస్, ఎన్పీపీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Arunachal Pradesh
- BJP
- four
- join
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

