AAP Ka RamRajya | ‘ఆప్ కా రామరాజ్య’.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆప్
AAP Ka RamRajya | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను బుధవారం ప్రారంభించింది. రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారని ఆ పార్టీ పేర్కొంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్‌సైట్‌ను బుధవారం ప్రారంభించింది. (AAP Ka RamRajya) రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారని ఆ పార్టీ పేర్కొంది. ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ‘రామరాజ్యం’ భావనతో పని చేసిందని తెలిపారు. ‘రామరాజ్యం’ సాకారం కోసం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత పదేళ్లలో అద్భుతమైన విజయాలు సాధించారని చెప్పారు. మంచి పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత తాగు నీరు, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.
కాగా, మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శ్రీరామ నవమి రోజున తన ప్రజల మధ్య లేకపోవడం ఇదే తొలిసారి అని సంజయ్ సింగ్ తెలిపారు. తప్పుడు సాక్షుల వాంగ్మూలం ఆధారంగా నమోదు చేసిన నిరాధార కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

