Agra Man | భూవివాదంలో (land dispute) నలుగురు వ్యక్తులు తనపై దాడి చేసి సజీవంగా పూడ్చి పెడితే (Buried).. వీధి కుక్కలు (Stray Dogs) మట్టిని తవ్వడంతో బతికి బయటపడ్డానని ఓ వ్యక్తి (Agra Man) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో చోటు చేసుకుంది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. జులై 18న ఆగ్రాలోని అర్టోని ప్రాంతంలో 24 ఏళ్ల రూప్ కిశోర్ (Roop Kishore)పై నలుగురు వ్యక్తులు అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ దాడి చేశారు. దాడి అనంతరం రూప్ కిశోర్ మరణించాడనుకుని అతడిని ఓ పొలంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొన్ని వీధి కుక్కలు మట్టిని తవ్వి కిశోర్ శరీరాన్ని కొరికాయి. దీంతో స్పృహలోకి వచ్చిన కిశోర్.. ఎలాగోల అక్కడి నుంచి బయటపడి కొంతమంది స్థానికుల కంటపడ్డాడు. రూప్ కిశోర్‌ను చూసిన స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై రూప్ కిశోర్ తల్లి మాట్లాడుతూ.. ఇంటి వద్ద ఉన్న తన కుమారుడిని నలుగురు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారని అన్నారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
Also Read..
Governors conference | రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు ప్రారంభం