viral video | గోవాలో విషాదం.. రోడ్డుపై చెత్త పడేసిన యువకుడు.. వీడియో వైరల్ కావడంతో ఆత్మహత్య
viral video : సోషల్ మీడియా కారణంగా గోవాలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై ఒక వ్యక్తి చెత్త పడేస్తుండగా వైరల్ కావడం, అతడిపై ట్రోలింగ్ జరగడం వంటి కారణాలతో కుంగిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
viral video : సోషల్ మీడియా కారణంగా గోవాలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై ఒక వ్యక్తి చెత్త పడేస్తుండగా వైరల్ కావడం, అతడిపై ట్రోలింగ్ జరగడం వంటి కారణాలతో కుంగిపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగినట్లు స్తానిక పోలీసులు తెలిపారు. ఉత్తర గోవాలోని మాపుసాకు చెందిన సామ్యూల్ గార్విన్ డే బ్రగాన్సా అనే 2 ఏళ్ల విద్యార్తి ఇటీవల రోడ్డుపై చెత్త పడేశాడు.
దీన్ని అక్కడివారెవరో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. పెద్ద చర్చకు దారితీసింది. సామ్యూల్‌పై ట్రోల్ జరిగింది. అందరూ అతడి చర్యను విమర్శించారు. తను చేసిన పని నిర్లక్ష్యానికి నిదర్శనం అని, అతడు చేసిన పని వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకావం ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సామ్యూల్‌పై మపుసా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. దీంతో సామ్యూల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అటు ట్రోలింగ్, పోలీస్ కేసు కారణంగా తీవ్ర ఒత్తిడికి గురైన అతడు గురువారం రాత్రి తన బాత్రూమ్లో పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. గాయపడిన అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికీ అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనతో సామ్యూల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు ఆత్మహత్యకు చేసుకునేందుకు కారణమైన వ్యక్తులపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని స్తానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. సామ్యూల్ ఆత్మహత్యపై ప్రభుత్వం స్పందించింది. అతడి ఆత్మహత్యపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆదేశించారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Goa
- Mapusa
- Pramod Sawant
- Student
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

