Imphal airport shut | గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. విమానాశ్రయం మూసివేత
Imphal airport shut | గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రాజధాని ఇంఫాల్‌లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతలంలో గుర్తుతెలియని డ్రోన్లు ఎగురుతుండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. (Imphal airport shut) ఆ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. అక్కడికి చేరుకోవాల్సిన విమానాలను ఇతర ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.
కాగా, మణిపూర్‌లోని మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించేందుకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొండ ప్రాంతాల్లో అత్యధికంగా నివసించే కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. మే నెలలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించగా నాటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. హింసాత్మక సంఘటనల్లో సుమారు 200 మంది మరణించగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. మరోవైపు శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడంతో మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని నవంబర్ 23 వరకు పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

