న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సర్కారుకు చీవాట్లు పెట్టింది సుప్రీంకోర్టు(Supreme Court). ఓ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరీ చేసినా.. అతన్ని జైలు నుంచి రిలీజ్ చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. దీంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు.. యూపీ సర్కారుకు 5 లక్షల నష్టపరిహారం విధించింది. మతమార్పుడలకు పాల్పడుతున్న ఆరోపణలపై ఓ వ్యక్తిని జైలులో వేశారు. అయితే అతనికి బెయిల్ మంజూరీ అయ్యింది. కానీ బెయిల్ వచ్చిన 28 రోజుల తర్వాత అతన్ని రిలీజ్ చేశారు. ఘజియాబాద్ జిల్లా జైలు నుంచి అతను జూన్ 24వ తేదీన రిలీజ్ అయ్యాడు. ఈ కేసులో యూపీ సర్కారుపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఆలస్యంగా రిలీజ్ చేసినందుకు బాధితుడికి 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ కేవీ విశ్వనాథణ్, ఎన్ కోటేశ్వర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సుప్రీం ఆదేశాల ప్రకారం పరిహారం చెల్లించినట్లు ప్రభుత్వం చెప్పింది.