న్యూఢిల్లీ: విమానం గాల్లో ఎగురుతుండగా కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లు కజ్జికాయలు (Gujiyas) తిని , కూల్‌డ్రింక్ తాగారు. హోలీని ఇలా సెలబ్రేట్ చేసుకున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విమానం భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు పైలట్లపై స్పైస్‌జెట్ చర్యలు చేపట్టింది. వారిద్దరినీ గ్రౌండింగ్ చేసింది. ఈ నెల 8న హోలీ రోజున స్పైస్‌జెట్‌కు చెందిన విమానం ఢిల్లీ నుంచి గౌహతికి ప్రయాణించింది. అయితే కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లు హోలీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా కజ్జికాయలు తిన్నారు. అలాగే కూల్‌డ్రింక్ కూడా తాగారు.
కాగా, హోలీ స్వీట్ అయిన స్వీట్ కజ్జికాయను ఒక పైలట్ చేతిలో పట్టుకోగా, కాక్‌పిట్‌లోని విమాన పరికరంపై ఉంచిన పేపర్‌పై మరొకటి ఉంది. అలాగే డ్రింక్ ఉన్న పేపర్ గ్లాస్, విమాన ఇంధనం కటాఫ్ లివర్‌పై ఉంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసి నెజినట్లు షాకయ్యారు. ఆ డ్రింక్ ఒలికితే ఎలక్ట్రానిక్ షార్ట్ సర్క్యూట్‌కు దారి తీసి విమాన వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న పైలట్ల నిర్లక్ష్యంపై మరికొందరు మండిపడ్డారు. కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఈ ఫొటోను ట్యాగ్ చేశారు.
మరోవైపు ఈ సంఘటనపై స్పైస్‌జెట్ సంస్థ స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా కాక్‌పిట్ లోపల పైలట్లు ఆహారం తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. విమానానికి ప్రమాదం కలిగించేలా వ్యవహరించిన ఇద్దరు పైలట్లపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది. రిపోర్ట్ అందే వరకు వారిద్దరినీ గ్రౌండింగ్ చేసి విధులకు దూరంగా ఉంచినట్లు వెల్లడించింది.
Also Read: