న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ నేపాల్ నైట్‌క్లబ్‌లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ కాం గ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్‌లో పార్టీ చేసుకుంటున్న వీడియోను ఈసారి బీజేపీ రిలీజ్ చేసింది.
ఐఎన్‌సీ అంటే ‘ఐ నీడ్ సెలబ్రేషన్ అండ్ పార్టీ’ అంటూ ఎద్దేవా చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజాద్ పూనావాలా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారా లేక పార్టీలో చిందులు వేశారా అని పూనావాలా రాసుకొచ్చారు.
రాహుల్ గాంధీ నేపాల్ పబ్‌లో గడిపితే జూనియర్ నేతలు పార్టీ శిక్షణా శిబిరంలో చిందులు వేశారని అన్నారు. నేత ఎలా ఉంటే కార్యకర్తలు అలా తయారవుతారని అన్నారు. 24 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో కాంగ్రెస్ కార్యకర్తలు మ్యూజిక్కు అనుగుణంగా స్టెప్పులు వేశారు.