Modi 3.0 : మోదీ క్యాబినెట్లో తమకు దక్కిన పోస్టులపై ఎన్సీపీ తర్వాత తాజాగా శివసేనలోనూ అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేన తమకు ఆఫర్ చేసిన క్యాబినెట్ బెర్త్‌లపై కినుక వహించింది. క్యాబినెట్ మంత్రి పదవిని తాము ఆశించామని ఆ పార్టీ పేర్కొంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం సైతం తమకు సహాయ మంత్రి పదవితో సరిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాము క్యాబినెట్ మంత్రి పదవి ఆశించామని, ఎన్డీయే ఇతర భాగస్వామ్య పక్షాలకు దక్కిన పదవులను ప్రస్తావిస్తూ శివసేన చీప్ విప్ శ్రీరంగ్ బర్నే పెదవివిరిచారు. ఐదుగురు ఎంపీలు కలిగిన చిరాగ్ పాశ్వాన్, ఒక ఎంపీ కలిగిన జితన్ రాం మాంఝీ, ఇద్దరు ఎంపీలు కలిగిన జేడీఎస్‌లకు ఒక్కో క్యాబినెట్ మంత్రి పదవిని కేటాయించారని తమను మాత్రం సహాయ మంత్రి పదవికి పరిమితం చేశారని వాపోయారు.
ఏడుగురు ఎంపీలున్న తమకు కేవలం ఒకే ఒక్క సహాయ మంత్రి పదవిని కేటాయించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి శివసేన పాత మిత్రుడని, కనీసం తమకు ఒక క్యాబినెట్ మంత్రి పదవిని కేటాయించాల్సిందని పేర్కొన్నారు.
Read More :
Chandra Sekhar Pemmasani: మోదీ సర్కారులో అత్యంత సంపన్న మంత్రి ఎవరో తెలుసా?