భోపాల్: నర్సింగ్ విద్యార్థిని ఫొటోలను మైనల్ బాలుడు మార్ఫింగ్ చేశాడు. తన స్నేహితుడితో కలిసి ఆమెను బెదిరించాడు. వారిద్దరూ కలిసి ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. (Boys Rape Girl) బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని షాడోల్లో ఈ సంఘటన జరిగింది. 18 ఏళ్ల యువతి నర్సు కోర్సు చదువుతున్నది. ఆమె అద్దెకు ఉండే ఇంటి యజమాని మైనర్ కుమారుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ ద్వారా ఆ యువతి ఫొటోలను అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. తన ఫ్రెండ్‌తో కలిసి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత యువతి ఆ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం వారి మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.