
బేలగవి (కర్ణాటక), అక్టోబర్ 23: బ్లాస్ ఫంగస్‌తో తన భార్య మరణించడాన్ని జీర్ణించుకోలేని భర్త (ఎక్స్ సర్వీస్మన్), ఆయన నలుగురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం హుక్కేరి తాలుకాలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. గోపాల్ హదిమాని (46), ఆయన పిల్లలు సౌమ్య (19), శ్వేత (16), సాక్షి (11), శ్రీజన్ హదిమాని (8) శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం నుంచి కుటుంబసభ్యులెవరూ బయట కనిపించకపోవడంతో పక్కింటి వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు.