vote of confidence motion | ఈడీ సమన్ల నేపథ్యంలో.. విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్
vote of confidence motion | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మద్యం పాలసీ స్కామ్‌పై ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం, ఢిల్లీ కోర్టుకు కూడా హాజరుకావాల్సి ఉండటంతో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు వస్తుండటంతో ఈ చర్యకు దిగారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. (vote of confidence motion) మద్యం పాలసీ స్కామ్‌పై ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం, ఢిల్లీ కోర్టుకు కూడా హాజరుకావాల్సి ఉండటంతో ఆయనను అరెస్ట్ చేయవచ్చన్న ఊహాగానాలు వస్తుండటంతో ఈ చర్యకు దిగారు. శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు. శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అన్నదానిపై మాట్లాడారు. బీజేపీ సభ్యులు ఆప్ ఎమ్మెల్యేలను సంప్రదించారని, ఢిల్లీ సీఎంను త్వరలో అరెస్ట్ చేస్తారని వారితో చెప్పారని అన్నారు. అలాగే 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు అంగీకరించారని, మరికొంత మంది బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు ఆప్ ఎమ్మెల్యేలతో చెప్పడంతోపాటు బీజేపీలో చేరేందుకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు.
కాగా, బీజేపీ ఆఫర్‌కు తాము అంగీకరించలేదని ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే ఇతర ఆప్ ఎమ్మెల్యేలతో మాట్లాడగా ఏడుగురిని బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదించినట్లు తెలిసిందన్నారు. దీంతో మరోసారి ఆపరేషన్ కమలం కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో మద్యం పాలసీ కుంభకోణంపై వచ్చిన ఆరోపణలు ఆ స్కామ్ గురించి కాదన్నది స్పష్టమవుతున్నదని కేజ్రీవాల్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తప్పుడు కేసులు పెట్టి తమ పార్టీని విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నమని ఆరోపించారు.
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యం మద్యం పాలసీపై దర్యాప్తు చేయడం కాదని, తమ నాయకులను అరెస్ట్ చేయడమేనని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారని అన్నారు. మద్యం పాలసీ కేసు ముసుగులో ప్రభుత్వాన్ని పడగొట్టడమే వారి లక్ష్యమని విమర్శించారు. వారు ఢిల్లీలో ఎప్పటికీ ఎన్నికల్లో గెలువలేరని తెలుసు కాబట్టి ఇలాంటి కుట్రకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తమ పార్టీకి అసెంబ్లీలో మెజార్టీ ఉన్నప్పటికీ, బీజేపీ ప్రయత్నాలను ఎండగట్టేందుకు విశ్వాస పరీక్షను ఎదుర్కొంటామని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

