Watch: చెత్త, మట్టి పేరుకుపోయి ప్రమాదకరంగా రోడ్డు.. క్లీన్ చేసిన బెంగళూరు నివాసితులు
Bengaluru Residents Clean Road | ఒక రోడ్డుపై చెత్త, మట్టి పేరుకుపోయాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వాహనదారులు, పాదచారులు జారిపడేలా ప్రమాదకరంగా ఆ మార్గం మారింది. ఈ నేపథ్యంలో టెక్కీలు, కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ విద్యార్థులు రంగంలోకి దిగారు. చెత్త ఊడ్చి మట్టి ఎత్తి ఆ రోడ్డును శుభ్రం చేశారు.
బెంగళూరు: ఒక రోడ్డుపై చెత్త, మట్టి పేరుకుపోయాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో వాహనదారులు, పాదచారులు జారిపడేలా ప్రమాదకరంగా ఆ మార్గం మారింది. ఈ నేపథ్యంలో టెక్కీలు, కాలేజీ స్టూడెంట్స్, స్కూల్ విద్యార్థులు రంగంలోకి దిగారు. చెత్త ఊడ్చి మట్టి ఎత్తి ఆ రోడ్డును శుభ్రం చేశారు. (Bengaluru Residents Clean Road) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కడుబీసనహళ్లి, వర్తూరు మధ్య రద్దీగా ఉండే బలగెరె రహదారిపై చెత్త, మట్టి పేరుకుపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, నడిచి వెళ్లేవారు జారి పడుతున్నారు. బెంగుళూరు పౌర సంస్థ బీబీఎంపీకి ఎన్నిస్లారు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నిధులు లేవంటూ అధికారులు నిర్లక్ష్యం వహించారు.
కాగా, అధికారుల తీరుతో విసిగిపోయిన బెంగళూరు వాసులు రంగంలోకి దిగారు. టెక్కీలు, విద్యార్థులు కలిసి వచ్చారు. వారాంతంలో ఆ రహదారిపై చెత్త ఎత్తివేసి క్లీన్ చేశారు. పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ఈ క్లీనింగ్ డ్రైవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు స్పందించారు. రోడ్డును క్లీన్ చేసిన టెక్కీలు, స్టూడెంట్స్‌ను ప్రశంసించారు. బీబీఎంపీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా దీనిపై స్పందించారు. కొన్నిసార్లు కొన్ని పాఠాలు ఉత్తమ గుణపాఠాలు అవుతాయని అన్నారు. బెంగళూరు వాసులు బలగెరె రోడ్‌ను క్లీన్ చేసిన సంఘటనను బీబీఎంపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మరోసారి ఇలా జరుగకుండా చూడాలని వారిని ఆదేశించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.
Clearing the way for the road side drains all by themselves. Roads are always flooded for little rain. Multiple requests to clean were turned down sighting no budget.#BalagereDemandsRoad#SaveMahadevapura@CMofKarnataka @DKShivakumar @0RRCA @WFRising @BPACofficial pic.twitter.com/QgnfeSAJy7
— NammaMahadevapura (@OurMahadevapura) June 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

