Chandrayaan-3 Success | అప్పట్లో గోమూత్రం పార్టీ ఇచ్చాడు..ఇప్పుడు ఏకంగా మూన్‌పై..!
చంద్రయాన్-3 చంద్రుడి (Chandrayaan-3 Success) దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపధ్యంలో స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశం రాజధానిగా జాబిల్లిని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందూ సన్యాసి స్వామి చక్రపాణి మహరాజ్ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు, విచిత్ర విన్యాసాలకు ఆ స్వామీజీ పెట్టింది పేరు. హిందూ మహాసభ అధ్యక్షుడి పేరుతో సంచలన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపుతుంటాడు. ఇప్పుడు తన విలక్షణ వ్యాఖ్యలకు మూన్ మిషన్‌ను ఎంచుకున్నాడు. ఇంకేం..విచిత్ర డిమాండ్స్‌తో మీడియా ముందుకొచ్చాడు. చంద్రయాన్-3 చంద్రుడి (Chandrayaan-3 Success) దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నేపధ్యంలో స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అయిన ప్రదేశం రాజధానిగా జాబిల్లిని హిందూ రాజ్యంగా ప్రకటించాలని హిందూ సన్యాసి స్వామి చక్రపాణి మహరాజ్ డిమాండ్ చేశారు. ఇతర మతాల కంటే ముందుగా చంద్రుడిపై యాజమాన్య హక్కులను మనం ప్రకటించుకోవాలని భారత ప్రభుత్వాన్ని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కోరారు.
ఈ దిశగా భారత పార్లమెంట్ తక్షణమే ఓ తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులెవరూ చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్రదేశానికి చేరుకోకముందే భారత ప్రభుత్వం వేగంగా స్పందించాలని కోరారు. చంద్రుడిని హిందూ సనాతన రాజ్యంగా పార్లమెంట్ ప్రకటించాలని, చంద్రయాన్ 3 దిగిన ప్రదేశం శివశక్తి పాయింట్‌ను హిందూ రాజ్య రాజధానిగా అభివృద్ధి చేయాలని అన్నారు.
संसद से चांद को हिंदू सनातन राष्ट्र के रूप में घोषित किया जाए,चंद्रयान 3 के उतरने के स्थान “शिव शक्ति पॉइंट” को उसकी राजधानी के रूप में विकसित हो ,ताकि कोई आतंकी जिहादी मानसिकता का वहा न पहुंच पाए 🌸🙏🌸स्वामी चक्रपाणि महाराज, राष्ट्रीय अध्यक्ष, अखिल भारत हिंदू महासभा/ संत महासभा pic.twitter.com/HPbifYFZzX
— Swami Chakrapani Maharaj (@SwamyChakrapani) August 27, 2023
అలా చేస్తేనే జిహాదీ భావజాలం కలిగిన ఉగ్రవాదులెవరూ అక్కడుకు చేరుకోలేరని స్వామి చక్రపాణి ముదిరాజ్ విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. స్వామి చక్రపాణి గతంలోనూ పలు విచిత్ర విన్యాసాలు చేశారు. 2020లో దేశంలో కరోనా వ్యాప్తి ప్రబలిన సమయంలో ఆయన దేశ రాజధానిలో గోమూత్ర పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో ఆయనతో పాటు హిందూ మహాసభ సభ్యులు కరోనా ఆటకట్టించేందుకు గోమూత్రం సేవించారు.
Read More :
Ajit Pawar | ఎన్సీపీని ఎందుకు చీల్చాల్సి వచ్చిందంటే.. వెల్లడించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

