Ajit Pawar | ఎన్సీపీని ఎందుకు చీల్చాల్సి వచ్చిందంటే.. వెల్లడించిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్
Ajit Pawar | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ (BJP), సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిందన్నారు.
Ajit Pawar | రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని మహారాష్ట్ర (Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే తమ వర్గం బీజేపీ (BJP), సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి (Mahayuti) కూటమిలో ఉన్నప్పటికీ అన్ని కులాలు, మతాల ప్రజలకు సమన్యాయం చేయడం మా కర్తవ్యమని వెల్లడించారు. రైతులకోసం ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. గతంలో తాను జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశానని గుర్తుచేశారు. గత నెల ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్.. సీఎం షిండే నేతృత్వంలోని శివసే, బీజేపీ ప్రభుత్వంలో చేరడం, వెంటనే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (NCP) రెండు వర్గాలు చీలిపోయింది.
అయితే, రెండు రోజులక్రితం శరద్ పవార్ (Sharad Pawar) విలేకరులతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ తమ పార్టీకి చెందిన నేతే అని, పార్టీకి సంబంధించి జాతీయ స్థాయిలో విడిపోతే దాన్ని చీలిక అంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదన్నారు. అయితే, కొద్దిగంటలకే పవార్ మాటమార్చారు. అజిత్ పవార్ తమ నాయకుడని అనలేదని, అజిత్ పవార్‌కు సుప్రియ చెల్లెలు కాబట్టి అలా అని ఉండొచ్చన్నారు. ఇందులో రాజకీయ అర్థాలు వెతకాల్సిన అవసరం లేదని చెప్పారు. శరద్ వ్యాఖ్యల నేపథ్యంలో అజిత్ చేసిన వ్యాఖ్యలు పమహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన్యత సంతరించుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

