Aftab narco test | శ్రద్ధా హత్య కేసులో ముగిసిన అఫ్తాబ్ నార్కో టెస్ట్.. రెండు గంటల పాటు విచారణ
Aftab narco test | శ్రద్ధావాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో పరీక్షలు ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు అఫ్తాబ్‌ను పోలీసులు ప్రశ్నించారు. పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లోనూ శ్రద్ధను చంపినట్లు అఫ్తాబ్ అంగీకరించినట్లు తెలిసింది.
Aftab narco test | శ్రద్ధావాల్కర్ దారుణ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ నార్కో పరీక్షలు కొద్దిసేపటికి క్రితం ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు అఫ్తాబ్‌ను నార్కో పరీక్ష సందర్భంగా ప్రశ్నించారు. శ్రద్ధా వినియోగించిన మొబైల్ ఫోన్, ఇతర వస్తువుల గురించి పోలీసులు ఆరా తీశారు. పరీక్షలో అడిగిన ప్రశ్నలకు అఫ్తాబ్ ఇంగ్లిష్‌లోనే సమాధానమిచ్చాడని దవాఖాన వర్గాలు తెలిపాయి. నార్కో టెస్టులో సైకాలజిస్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్ రోహిణికి చెందిన ఫొటో నిపుణులు, అంబేద్కర్ దవాఖాన వైద్యులు పాల్గొన్నారని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు.
ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్‌ను గురువారం ఉదయం 8.40 గంటలకు రోహిణిలోని బాబా సాహెబ్ అంబేద్కర్ దవాఖానకు తీసుకొచ్చారు. అక్కడ నార్కో పరీక్షకు ముందు అతడికి సాధారణ వైద్య పరీక్షలు జరిపారు. ఉదయం 10 గంటలకు మొదలైన పరీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. పాలిగ్రాఫ్ పరీక్ష అనంతరం అఫ్తాబ్ నార్కో టెస్ట్‌లోనూ శ్రద్ధాను చంపినట్లు అంగీకరించినట్లు సమాచారం. శ్రద్ధావాల్కర్ వాడిన మొబైల్, దుస్తులను ఎక్కడ విసిరేశాడో కూడా సమాచారమిచ్చినట్లు తెలుస్తున్నది.
నార్కో పరీక్ష అసంపూర్తిగా జరిగిన పక్షంలో పోలీసులు అఫ్తాబ్‌కు బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అఫ్తాబ్ చాలా తెలివైన వాడని, ఏ సమయంలోనైనా ఈ కేసులో కొత్త ట్విస్ట్ తీసుకురాగలడని ఓ అధికారి మీడియాకు చెప్పారు. ఇప్పటివరకు పోలీసుల మాటకు కట్టుబడి సహకరిస్తున్నాడని, పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలకు కూడా అంగీకరించాడని ఆయన తెలిపారు. అతడు చూపుతున్న మంచి ప్రవర్తనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఏప్పుడైనా ప్లేట్ పిరాయించి ముప్పుతిప్పలు పెట్టగలడని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

