Afraid Of Crossing | బ్రిడ్జి దాటాలంటే భయమేస్తోంది.. బీహార్ బీజేపీ నేత ఆందోళన
Afraid Of Crossing | బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి దాటాలంటే భయమేస్తోందని అన్నారు. వంతెనలు కూలడంపై సీరియస్‌గా దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు.
పాట్నా: బీహార్‌లో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జి దాటాలంటే భయమేస్తోందని అన్నారు. (Afraid Of Crossing) వంతెనలు కూలడంపై సీరియస్‌గా దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో గత 15 రోజుల్లో పది వంతెనలు కూలిపోయాయి. దీంతో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కాగా, బీహార్‌లో వరుసగా వంతెనలు కూలడంపై ఆ రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజేపీ నేత డాక్టర్ నిఖిల్ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బీహార్‌లోని ఏదైనా ఫ్లైఓవర్ లేదా బ్రిడ్జి దాటాలంటే భయంగా ఉంది’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. పది రోజుల్లో ఆరుపైగా వంతెనలు కూలిపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘సీరియస్‌గా దర్యాప్తు, ఆడిటింగ్ అవసరం. నిర్మాణ సంస్థలను బాధ్యులుగా చేయాలి. వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ఇంజినీర్లపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి’ అని ఎక్స్ పోస్ట్‌లో డిమాండ్ చేశారు.
మరోవైపు మాజీ జర్నలిస్టు అయిన డాక్టర్ నిఖిల్ ఆనంద్ 2015లో బీజేపీలో చేరారు. బీహార్‌లో పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన ఆయన ఇప్పుడు బీజేపీ ఓబీసీ మోర్చాలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
I am afraid of crossing through any Flyover or Bridge in Bihar. Surprised that in last 10 days half a dozen bridges have collapsed.
A serious probe & auditing is needed. The responsibility be fixed on the construction company, blacklist them. The engineers must be booked. #Bihar
— Dr. Nikhil Anand (@NikhilAnandBJP) July 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Afraid Of
- Bihar
- BJP leader
- Bridges
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

