మంచిర్యాల అర్బన్, డిసెంబర్ 21 : రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా అదనపు న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్శ్రీ లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 3700 కేసులు పరిషరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నిర్మల, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి రాంమ్మోహన్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, నిరోష, కృష్ణా తేజ, బార్ అధ్యక్షులు జగన్, సభ్యులు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.