స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్లాబిష్మెంట్(ఏడీఆర్డీఈ) స్కేడైవింగ్తో ఆకాశంలో ‘హ్యూమన్ తిరంగా’ను సృష్టించింది. జెండాలోని మూడు రంగులతో ఉండే దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు భూమికి 15 వేల అడుగుల ఎత్తులో ఈ విన్యాసం చేశారు. ఈ తరహా విన్యాసం ఇదే తొలిసారి.