హైదరాబాద్: సూర్యుడి స్టడీ కోసం ఆదిత్య ఎల్1 మిషన్(Aditya-L1 Mission)ను ఇస్రో ప్రయోగించనున్న విషయం తెలిసిందే. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ సెంటర్ నుంచి రేపు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం ఆ ప్రయోగం కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. అయితే ఆదిత్య ఎల్1 మిషన్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మరికొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఎల్1 పాయింట్ చేరుకునేందుకు ఆదిత్యకు 125 రోజుల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. భూమి నుంచి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఎల్1 పాయింట్ కక్ష్య ఉన్న విషయం తెలిసిందే. అక్కడి నుంచే సూర్యుడిని ఆదిత్య స్టడీ చేయనున్నది.
#WATCH | ISRO chief S Somanath says "Today the countdown of Aditya L1 is starting and it will launch tomorrow around 11.50 am. Aditya L1 satellite is for studying our Sun. It will take another 125 days to reach the L1 point. This is a very important launch. We have not yet… pic.twitter.com/zdZn0g8LI0
— ANI (@ANI) September 1, 2023
సూర్యుడి అధ్యయనం కోసమే ఆదిత్యను లాంచ్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆదిత్య ప్రయోగం చాలా కీలకమైందన్నారు. చంద్రయాన్-4కు సంబంధించిన అంశంపై ఇంకా డిసైడ్ కాలేదన్నారు. దీనిపై త్వరలోనే తేదీని ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు. ఆదిత్య ఎల్1 తర్వాత గగన్‌యాన్ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో గగన్‌యాన్ ప్రయోగం ఉంటుందని సోమనాథ్ వెల్లడించారు.
చంద్రయాన్-3కి చెందిన ప్రజ్ఞాన్ రోవర్ మంచిగా వాకింగ్ చేస్తున్నట్లు ఇస్రో చీఫ్ చెప్పారు. సెప్టెంబర్ 13వ తేదీ వరకు అంతా సవ్యంగా సాగుతుందని ఆయన వెల్లడించారు.