ఆదిత్య-ఎల్1 నాలుగో కక్ష్య పెంపు విజయవంతం
సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. తాజాగా ఇస్రో శుక్రవారం నిర్వహించిన నాలుగో భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతమైంది.
- ప్రస్తుతం 256 x 1,21,973 కిలోమీటర్ల కక్ష్యలో శాటిలైట్
బెంగళూరు, సెప్టెంబర్ 15: సూర్యుడి గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. తాజాగా ఇస్రో శుక్రవారం నిర్వహించిన నాలుగో భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతమైంది. ప్రస్తుతం ఆదిత్య-ఎల్1 శాటిలైట్ 256 x 1,21,973 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతున్నది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది.
19న ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ఆదిత్య-ఎల్1
మొత్తం ఐదు భూ కక్ష్య పెంపు ప్రక్రియల్లో ఇప్పటికే నాలుగు పూర్తయ్యాయి. ఈ నెల 3న మొదటి భూ కక్ష్య పెంపు ప్రక్రియ, 5న రెండోది, 10న మూడో కక్ష్య పెంపు ప్రక్రియ పూర్తయింది. తాజాగా శుక్రవారం నాలుగో ప్రక్రియ కూడా పూర్తయింది. చివరిదైన ఐదో భూ కక్ష్య పెంపు ప్రక్రియ పూర్తయ్యాక శాటిలైట్ భూ కక్ష్యను వీడి ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశిస్తుంది. అనంతరం సుదీర్ఘ ప్రయాణం తర్వాత 15 లక్షల కిలో మీటర్ల దూరంలోని ఎల్-1 పాయింట్‌కు శాటిలైట్ చేరుకోనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

