కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూన్ 9 : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతాదళాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతిచెందగా, మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం సుక్మా జిల్లాలో జరిగింది. సుక్మా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అదనపు ఎస్పీ ఆకాశ్రావు గిరిపుంజె, సబ్ డివిజినల్ పోలీస్ అధికారి చంద్రాకర్, తహసీల్ ఇన్స్పెక్టర్ సోనల్ గ్వాలా తమ అధికారిక వాహనంలో గస్తీకి బయలుదేరారు. ఈ క్రమంలో కొంటా-ఎర్రబోర్ మార్గమధ్యంలో భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ఓ చెప్టా కింద అమర్చిన మందుపాతర మీదుగా అదనపు ఎస్పీ వాహనం వెళ్లింది.