చెన్నై: నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ వక్ఫ్ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నదని, వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. పిటిషనర్లలో ఏఐఎంపీఎల్బీ, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పలు పార్టీల ఎంపీలు, సమస్త్త కేరళ జామియాతుల్ ఉలేమా, ఎస్డీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎన్జీవో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఉన్నాయి.